Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకన్న భక్తులకు టీటీడీ సంక్రాంతి కానుక!... ‘ప్రత్యేక’ టికెట్లపై మరో అదనపు లడ్డూ!

తిరుమల వెంకన్న భక్తులకు నిజంగా ఇది శుభవార్తే. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసే భక్తులకు ఇకపై మరో అదనపు లడ్డూ లభించనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300 టికెట్లను కొనుగోలు చేస్తున్న భక్తులకు ఇప్పటిదాకా రెండు ఉచిత లడ్డూలతో పాటు రూ.25కు ఓ లడ్డూ కలిపి మొత్తం 3 లడ్డూలు లభించేవి. అయితే ఒక టికెట్ పై ఒకే అదనపు లడ్డూ సరిపోవడం లేదని, ఈ కోటాను మరింత పెంచాలన్న భక్తుల విజ్ఞప్తిని పరిశీలించిన టీటీడీ... ఇకపై రూ.25కు మరో అదనపు లడ్డూను ఇచ్చేందుకు నిర్ణయించింది. అంటే, రూ.300 దర్శన టికెట్లు కొనుగోలు చేసే భక్తులకు ఇకపై రూ.25లకు ఒకటి చొప్పున 2 లడ్డూలు లభించనున్నాయి.

More Telugu News